Popular Posts
-
పురాణ విజ్ఞనం ప్రశ్నలు--సమాధానాలు దశరథ మహారాజు రామ పట్టాభిషేకానికి కైకయ రాజుని పిలవలేదు. దీనికి కారణము కైకను పెళ్లి ...
Blogger templates
Blogger news
Blogroll
About
పురాణ విజ్ఞనం
ప్రశ్నలు--సమాధానాలు
- దశరథ మహారాజు రామ పట్టాభిషేకానికి కైకయ రాజుని పిలవలేదు. దీనికి కారణము కైకను పెళ్లి చేసుకునేటప్పుడు కైక కి కలిగే కుమారుడిని కి రాజ్యం ఇస్తాను అని ప్రతిజ్ఞ చేశాడని రాముడే భరత నీతో చెప్పి ఉన్నాడు. ఇలా లోగాడే ప్రతిజ్ఞ చేసి ఉంటే శ్రీరామునికి పట్టాభిషేకం చేస్తాననడం అసత్యం కాదా? కైకకు ఏనాడు ఇచ్చిన వరాలని నిలుపుకుని తన సత్య ప్రతిజ్ఞ కోసమేకదా రాముని అడవికి పంపించాడు. ఇది తెలిసిన రాముడు పట్టాభిషేకానికి ఎలా ఒప్పుకున్నాడు?
మీరు చెప్పిన కదా అంతా నిజమే. ఇది మంచి ప్రశ్న కూడా. కానీ మహాప్రాజ్ఞుడైన దశరథుడు, కైకమ్మ తండ్రితో యుక్తిగా ఒప్పుకున్నాడు.' పట్టాభిషేకం సమయే భవేయం స్మారితో యది' పట్టాభిషేక వయస్సు వచ్చినప్పుడు నువ్వు నన్ను అడిగితే నీ కూతురు కొడుక్కే రాజ్యం ఇస్తానని కైకయ రాజు కి చెప్పాడు. రాముని యందు భరతుని మీద కంటే ఎక్కువగా అభిమానము ఉండుటచే కైకేయ రాజు ఆ కోరికలు విరమించుకున్నాడు. అయినా దశరధునికి వున్న అనుమాన్ని బట్టి కైకయ రాజుని పిలవలేదు. ఈ రహస్యం తెలియడంచేతనే రాముడు పట్టాభిషేకానికి అడ్డు చెప్పలేదు.
- విష్ణుమూర్తి పరశురామావతారం చాలించిన తరువాతనే కదా రామ అవతారం ఎత్తింది. అటువంటప్పుడు రాముడి వివాహం అయ్యే అయోధ్య కు వెళుతుంటే, పరశురాముడు ఎలా ఎదురు అవుతాడు?
- పరశురామునికి నిర్యణం లేదు. పరశురాముడు చిరంజీవి. భగవంతుడు అనేకంగా ఏకకాలంలో అవతరించడం లో ఆశ్చర్యం ఏమీ లేదు.
- జపం చేసేటప్పుడు రుద్రాక్ష మాల తో చేస్తారు కదా! దాన్ని కొందరు మెడలో వేసుకుంటారు ఎందుకు? దాన్ని ధరించడంలో ఏమైనా విశేషమున్నదా?
రుద్రాక్ష చాలా పవిత్రమైనది. అది రుద్రరూపం అంటారు. రుద్రాక్ష మాల తో జపం చేయటం విశేషఫలాన్ని ఇస్తుంది. దాన్ని ధరించడం వలన బి. పి, వగైరాలు తగ్గుతాయి. అందుకని ఎప్పుడు ధరించడం చాలా మంచిది కూడా.
- ఆంధ్ర వాల్మీకి రామాయణంలో సీతాదేవి భూదేవి ఒడిలోనికి వెళ్ళాక శ్రీరామడు అయోధ్యను 11000 సంవత్సరాలు పాలించినట్లు ఉన్నది. సీతాదేవి లక్ష్మీదేవి కదా. లక్ష్మీ వైకుంఠానికి వెళితే శ్రీరాముడు 11000 సంవత్సరాలు ఎలా ఉన్నాడు ఇక్కడ?
- సీతాదేవి లక్ష్మి యే. ఆమె భూమిలో ప్రవేశించినాది నిజమే. రామావతారంలో రాముడు మొత్తము పాలించిన సంవత్సరాలు 11000. అంతేకానీ సీత భూమిలో ప్రవేశించిన తరువాత 11000 అని కాదు అర్థం. సీత భూమిలోనికి ప్రవేశించిన తరువాత రాముడు కొద్దికాలమే పాలించాడు. లక్ష్మీనారాయణలు భూలోకంలో సీతారాములుగా ఉన్న. వైకుంఠంలో లక్ష్మీనారాయణులు లేరుని కాదు అర్థం. అక్కడ ఇక్కడ ఉండగలరు. సీత లక్ష్మీ లోకి ప్రవేశించింది. నారాయణుడు ఇక్కడ రాముడిగా, అక్కడ నారాయణుడుగా ఉన్నాడు.
- పూర్వజన్మ సుకృతము మానవుని గొప్పవాణ్ణి చేస్తుందా? లేక ఈ జన్మలో కృషి ముఖ్యమా?
రెండింటికీ అనుబంధం ఉన్నది. ఈ జన్మలో కృషియే మానవులు ఉన్నతుని చేస్తోంది. ఇది చేయాలంటే పూర్వజన్మ సంస్కారము ఉండాలి. ఆ సంస్కారము ఉంటే గాని ఈ జన్మలో ఉత్తమ కృషికి ఆలోచన రాదు. వచ్చినా ఈ జన్మ కృషి లేనిదే సార్ధకము గాదు. కాన వెనకటి ఆలోచన వదిలి మానవుడు ఉన్నతుడు కావడానికి బాగా కృషి చేయాలి ఈ జన్మలోనే అదే పురుష ప్రయత్నము అంటారు.
- ఏకలవ్యుడు, అర్జునులలో ఎవరు గొప్ప వారు?
గురు శుశ్రష చేసిన విలువిద్య నేర్చిన అర్జునుడు, మట్టి బొమ్మనే గురువుగా భావించి విద్య నేర్చిన ఏకలవ్యుడు ఇద్దరూ గొప్ప వారే ఈ విషయంలో. కానీ సమస్య గుణ సంపన్నుడు భగవదనుగ్రహ పాత్రుడు అర్జునుడు అది ప్రత్యేకత.
- వాల్మీకి రామాయణము రాయుటకు ప్రేరణ ఏమిటి?
నారదోపదేశం, బ్రహ్మ అనుగ్రహము, ప్రధానంగా శ్రీరాముని ప్రేరణ.
- మారిచుడు ' హా!లక్ష్మణ!' అని అరవగా భయపడిన సీత లక్ష్మణుణ్ణి నానా దుర్బాషలాది పంపించింది. దానివల్ల దుఃఖాన్ని అనుభవించానని మొల్ల రామాయణంలో ఒక పద్యం ఉంది. వాల్మీకం లో ఉన్నదా?
వాల్మీకం సుందరాకాండ 38 సర్గ 55 శ్లోకం నుండి 62 శ్లోకం వరకు సీత హనుమంతునితో లక్ష్మణుని పొగుడుతూ అతన్ని గుణగణాలను తెలిపింది. అందులో ధ్వని తాను దూషించి వచ్చిన లక్ష్మణుని ప్రసన్నుని చేయడమూ, అంతర్యముగా తనన్న మాటలకు పశ్చాత్తాపము సూచించడం అని తెలుసుకోవాలి. రామాయణం మందు ధ్వని చాలా ప్రధానం అని తెలుసుకోవాలి. అందుకే ఇది మహా కావ్యం అని అన్నారు.
"పితృవద్వర్త రామే మాతృవన్నాం సమాచరన్
హ్రియమణాం తదా వీరో నతు మాం వేద లక్ష్మణః
" జనకుని భంగి రామనృపచంద్రుని" అని ఉన్న మొల్ల పద్యానికి పైది మూలం. లక్ష్మణుని తాను దూషించిన హనుమంతునికి తెలియదు కదా, కాన స్పష్టంగా అది చెప్పలేదు కానీ పశ్చాత్తాపాన్ని సూచించింది. దాని అర్థం తన తప్పు తెలుసుకుని దుఃఖించడమే .
- ఓకే కదా ఒక్కొక్క పురాణం లో ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఎందుకు తేడా వస్తుంది? పురాణాలన్నీ రాసింది వ్యాసులు వారే కదా?
ఓకే కదా అయినా ఒక్కొక్క పురాణం ఒక్క ధర్మ సూక్ష్మమో, ఆదర్శము మనకు చెప్పుటకుగాను కొంచెము కథ వ్యత్యసము చెప్పుతుంది. అది విషయ ప్రధానమైన మార్పు. ప్రతి కల్పానికి కొన్ని చరిత్రను తిరిగి జరిగేవి ఉంటాయి. సర్దుకుని అన్వయుంచుటకు వీలు కాకపోతే అది కల్పాంత గాధ అని నిర్ణయించుకోవాలి. రచయిత ఒక్కరైనా సందర్భాన్నిబట్టి శ్రీ వ్యాసుడు అని సంకల్పములు దర్శించిన వాడుగా అనేకంగా రాయగలరు.
చేయించేది చేసేది భగవంతుడే అయితే జీవులు కర్మఫలం ఎందుకు అనుభవించాలి?
భగవంతుడు కర్మలు చేయడు. చేయించడు. జీవుల పూర్వజన్మల వాసనలను జీవులకు ప్రేరణను చేస్తాడు. దుష్కర్మ వాసనలను చెయ్యక సత్కర్మలు చేసే స్వాతంత్ర్యము జీవులకు ఉన్నది. తాను స్వతంత్రంగా చేసిన పుణ్య పాప కర్మల ఫలాన్ని జీవుల అనిపిస్తారు.
భారతంలో పర్వాలు 18, భగవద్గీత 18 అధ్యాయాలు, భారతీ యుద్ధము 18 అక్ష్వహీనులు, 18 దినాలు యుద్ధం జరిగింది గదా? ఈ పద్దెనిమిది అంశాల్లో విశేషం సెలవిస్తారా?
పురాణాలు కూడా 18. ఉపపురాణాలు 18. భారతానికి ' జయం 'అని పేరు. జయం అంటే సంఖ్య శాస్త్రము ప్రకారము 18. ఈ అంకెల్లో అంకెలను కూడిన 9 అవుతుంది. తొమ్మిది అంటే ప్రకృతి. దాన్ని గెలవడమే మోక్షము. అది సాధించుటకె ఈ గ్రంధాలన్నీ.
చాలామంది ధనవంతులు అక్రమంగా ధనం సంపాదించి, పాపాలు పోవాలంటే దేవాలయాలకు విరివిరిగా విరాళాలు ఇస్తున్నారు. వారి విరాళాలతో పాపాలు పోతాయా?
చేసిన పాపం అనుభవించితీరాలి. దేవాలయాలకు డబ్బులు ఇవ్వగానే పాపం పోతుంది అనేది భ్రమ మాత్రమే గాని వాస్తవం కాదు. కానీ వీలైనంత వరకు పాపము చేయకుండా ఉండడానికి ప్రయత్నించాలి. దేవాలయానికి వచ్చే డబ్బు వల్ల వేరే పుణ్యం ఉండవచ్చు.
రామాయణంలో లవ కుశులు రాముని కుమారులు కదా! లక్ష్మణుడికి సంతానం ఉన్నదా? సీత తల్లి పేరు ఏమిటి?
శ్రీరామునికి వల్లే భరత, లక్ష్మణ,శత్రుఘ్నుల ముగ్గురికి సంతానం ఉంది. సీతకి తల్లి లేదు. ఆమెl జగన్మాత. భూమి నుండి వచ్చింది కనుక భుజాత అని పిలిచారు. ఆమెకి ఆవిర్భావమే కానీ పుట్టుకలేదు.
సీతారామలక్ష్మణులు వనవాసానికి వెళ్ళన తర్వాత జనక చక్రవర్తి వారి విషయంలో ఏవైనా చర్య తీసుకున్నాడా?
శ్రీరాముడు తనంతట తాను పితృవాక్య పాలన కై వెళ్లాడు. శ్రీరాముని బలవంతం చేసి సీతమ్మ వెళ్ళింది. అనుకూల దాంపత్యం మధ్యలో జనకుని కి ఏమి ప్రమేయం. కుమార్తె కాపురంలో కల్పించుకునే హక్కు తండ్రికి లేదు.
శ్రీ కృష్ణ కి ఒక భార్య ఒక పది మంది సంతానం అని రాశారు.ఒక సందర్భంలో భీష్ముడు తన కంటే గొప్ప బ్రహ్మచారి అని చెప్పినట్లు విన్నాం. ఏమిటి ఈ వ్యత్యాసం?
భీష్మునికి పెళ్లి కాలేదు అంటారు పిల్లలు లేరు కనుక బ్రహ్మచారి, ఆశ్రమ రీత్యా. శ్రీకృష్ణునికి వివాహం అయినట్లు సంతనమైనట్లు వున్న ఆయన ఆసంగ సచ్చిదానంద స్వరూపుడు. కనుక పరబ్రహ్మ మూర్తి ఏ ఆశ్రమానికి సంబంధం లేదు.
అత్రి మహాముని అనసూయ దంపతులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏంటో మై వారికి సంతానంగా దత్తాత్రేయ అవతారం అని చెబుతారు. దత్తాత్రేయునికి స్మర్త్రుగామి అనే పేరు ఎలా వచ్చింది?
- అనసూయ అత్రి మహార్షుల కు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కుమారు లేదా బ్రహ్మ చంద్రునిగా శంకరుడు దూర్వాసునిగా, విష్ణుమూర్తి దత్తాత్రేయుడిగా అవతరించారు. లోకనుగ్రహర్ధమై త్రిమూర్తులు తమ పుత్రులుగా ఇక్కడే ఉండాలని అనసూయ కోరగా బ్రహ్మ,రుద్రులు కూడా తమ అంశలను శ్రీ దత్తమూర్తి యందు ఉంచి వారిద్దరూ తమ లోకానికి వెళ్ళినారు. కనుక శ్రీ దత్తమూర్తి షడ్బుజుడు. త్రిమూర్తి స్వరూపుడు స్మర్త్రగామి అనగా భక్తితో స్మరిస్తే అనుగ్రహించి వెంటవుంటారని అర్థం.
రామాయణ కథ లో శ్రీరాముడు మాణిక్య సంహారానికి వెళ్ళినప్పుడు అగ్నిహోత్రుడి వద్ద అసలు సీతను దాచి, రావణ సంహారానంతరం అసలు సీతను అగ్ని నుంచి తెచ్చి ఇచ్చారని చెప్పారు ఇది రామాయణంలో లేని కథ గాదా! ఇది ఎక్కడ ఉన్నా కథ?
ఈ మన్వంతరం లో జరిగిన కథలు వివరించిన వాడు వాల్మీకి.వాల్మీకి రామాయణం పరమ ప్రమాణం. ఈ రామాయణానికి విరోధం లేని ఇతర రామాయణ కథలు గ్రహించడంలో తప్పులేదు. దేవి భాగవతంలో భవిష్యోత్తరపురాణం లో ఈ కథ ఉంది. అవి ప్రమాణాలే.
సత్యభామ భూదేవి అవతారం అని అందుకే ఆమె నరకు ని చంప కలిగిందని కొన్నిచోట్ల విన్నాను. విశ్వామిత్రుడే సత్యభామగా అవతరించాడని మరొకచోట చెప్పగా విన్నాను. ఇందులో ఏది నిజమో?
సత్యభామ భూదేవి అంశతో జన్మించినదనేది ప్రసిద్ధమైన కథ. నరకుడు భూదేవి పుత్రుడు గనుక నరకవధ భూదేవి అనుమతితోనే జరిగినట్లుగా సత్యభామను యుద్ధానికి తీసుకుని వెళ్లారు. అంతేగాని చంపినది శ్రీకృష్ణుడే గాని సత్యభామ కాదు. విశ్వామిత్రుడు సత్యభామ అవసరం కాదు అది కలపన కథ.
పరశురాముడు అందరు రాజులను చంపి ఒక్క దశరధుని ఎందుకు వదిలినట్లు?
దశరథుడే గాక జనకుడు,రోమపాదుడు, అశ్వపతి మొదలైన రాజకీయ ప్రముఖులు ఆ కాలంలో ఎందరో ఉన్నారు. పైగా సీతా కల్యాణం అనంతరం పరుశురాముడు రాముడి దగ్గరకు రానే వచ్చాడు. కాన పరశురాముడుకి ఎంతో కాలం కిందట క్షత్రియ సంహారాన్ని తమ పితృదేవతల ఆజ్ఞ తో పరుశురాముడు ఉపసంహరించుకున్నాడు. అందుకే తరువాత రాజులు మిగిలారు.
0 comments:
Post a Comment